![]() |
![]() |

ఆహా ఓటీటీ ఒరిజినల్స్ గా స్ట్రీమింగ్ కు రాబోతోంది "వేరే లెవెల్ ఆఫీస్" వెబ్ సిరీస్. ఈ సిరీస్ ను వరుణ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వరుణ్ చౌదరి గోగినేని నిర్మిస్తున్నారు. ఇ సత్తిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్ జే కాజల్, అఖిల్ సార్థక్, శుభశ్రీ, మిర్చి కిరణ్, రీతు చౌదరి, స్వాతి చౌదరి, వసంతిక, మహేశ్ విట్టా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. డిసెంబర్ 12వ తేదీ నుంచి వేరే లెవెల్ ఆఫీస్ వెబ్ సిరీస్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఈ రోజు ఈ సిరీస్ ట్రైలర్ ను హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో జరిగిన ఈవెంట్ లో రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో నటుడు అఖిల్ సార్థక్, నటి శుభశ్రీ, నటుడు మిర్చి కిరణ్, నటి స్వాతి చౌదరి, నటి వసంతిక, నటుడు మహేశ్ విట్టా, నటుడు అఖిల్ వివాన్, నటి రీతు చౌదరి, డైరెక్టర్ ఇ సత్తిబాబు, డైరెక్టర్ ఇ సత్తిబాబు, స్క్రిప్ట్ రైటర్ ఎన్ షణ్ముక్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ కృపాచంద్ మాట్లాడుతూ - వేరే లెవెల్ ఆఫీస్ సిరీస్ నిర్మించేందుకు ఆహా నుంచి మాకు కావాల్సినంత సపోర్ట్ లభించింది. సత్తి బాబు గారి లాంటి అనుభవం ఉన్న డైరెక్టర్ తో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. మంచి టీమ్ సపోర్ట్ తో వేరే లెవెల్ ఆఫీస్ సిరీస్ ను అనుకున్నట్లు నిర్మించగలిగాం. డిసెంబర్ 12 నుంచి ఆహాలో మా సిరీస్ చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాం. అన్నారు.
ఆహా కంటెంట్ హెడ్ వాసుదేవ్ కొప్పినేని మాట్లాడుతూ - ఆహాలో ఎన్నో జానర్స్ వెబ్ సిరీస్ లు, షోస్ చేస్తున్నాం. ఒక ఆఫీస్ సిట్ కామెడీ సిరీస్ చేయాలని భావించాం. ఈ కాన్సెప్ట్ యూనిక్ గా ఉంటుందని అనిపించింది. అలా వేరే లెవెల్ ఆఫీస్ సిరీస్ కు ప్లానింగ్ మొదలైంది. ఇది యూనివర్సల్ కాన్సెప్ట్. అందరికీ నచ్చుతుంది. తమిళంలో సక్సెస్ అయిన ప్రాజెక్ట్ ను మన తెలుగు ఆడియెన్స్ కు మరింత రీచ్ అయ్యేలా తీసుకొస్తున్నాం. ప్యాషనేట్ అండ్ టాలెంటెడ్ టీమ్ తో ఈ సిరీస్ సక్సెస్ ఫుల్ గా మీ ముందుకు ఆహా తీసుకొస్తోంది. అన్నారు.
![]() |
![]() |